Friday, April 19, 2024

నిరసన తెలిపిన స్టాలిన్‌..

నల్లకుంట : దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంవత్సరం నుంచి కరోనా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేదని, మోడి ప్రభుత్వం అదాని, అంబానీలకు కొమ్ము కాస్తూ కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్‌ ప్రభుత్వమే ఉచితంగా పంపి ణీ చేయాలంటూ వామపక్ష విద్యార్ధి సంఘాల జాతీయ కమిటీల ఆందోళనల పిలుపులో భాగంగా సుందరయ్య కేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తమకు ఓట్లు వేసి సీట్లు కట్టబెట్టిన ప్రజల జీవితాల గురించి ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 600 టన్నుల ఆక్సీజన్‌ అడిగితే కేవలం 300 టన్నుల ఆక్సీజన్‌ మాత్రమే ఇచ్చిందన్నారు. కరోనా బారినపడి ఇప్పటికే అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించకపోవడం అత్యంత దారుణమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి అవసరమైన ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ చేసి కేరళ ప్రభుత్వం తరహాలో వైద్య సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శులు క్యార నరేష్‌, జావేద్‌, జిల్లా అధ్యక్షులు గోలి హరికృష్ణ, అశోక్‌, కాంపల్లి శ్రీనివాస్‌, మర్రి శ్రీమన్‌, ఉప్పల ఉదయ్‌కుమార్‌, సాయి తదితరులు పాల్గొన్నార

Advertisement

తాజా వార్తలు

Advertisement