Saturday, March 23, 2024

910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్‌ ఇండియా

ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా ఇండియా ఇప్పుడు తమ నూతన పార్లమెంట్‌ భవనం పట్ల గర్విస్తుంది. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా కీర్తించబడుతున్న ప్రస్తుత భవనం త్వరలోనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ కార్మికుల ప్రయత్నాలను గుర్తిస్తూ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్ధాపకత (ఎంఎస్‌డీఈ) నేతృత్వంలోని ఫర్నిచర్‌ అండ్‌ ఫిట్టింగ్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సీ), ఎన్‌డీఎంసీ జ్యురిస్‌డిక్షన్‌, నార్సి గ్రూప్‌ భాగస్వామ్యంతో రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ప్రయర్‌ లెర్నింగ్‌ (ఆర్‌పీఎల్‌) కింద 910 మంది కార్పెంటర్లకు శిక్షణ అందించడంతో పాటుగా సర్టిఫికెట్లను అందించింది.

ఈసందర్భంగా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్ధాపకత (ఎంఎస్‌డీఈ) మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కృష్ణ కుమార్‌ ద్వివేది మాట్లాడుతూ… భారతదేశపు మహోన్నత ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా పార్లమెంట్‌ భవనం నిలుస్తుందన్నారు. ఇది భారతదేశపు పరాక్రమం, గౌరవానికి నిదర్శనమన్నారు. మన కార్పెంటర్లకు అత్యుత్తమ శిక్షణ, లాంఛనంగా సర్టిఫికేషన్‌ అందించడం ద్వారా తగిన సాధికారిత అందించడంలో నేటి వేడుక ఓ ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ శిక్షణ ద్వారా ఈ కార్పెంటర్లు దేశీయంగా మాత్రమే గాక అంతర్జాతీయ మార్కెట్‌లలో సైతం తమ సత్తా చాటగలదన్నారు. నర్సిగ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నర్సి డీ కులారియా మాట్లాడుతూ… ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం తమ కార్పెంటర్‌ కమ్యూనిటీకి అత్యంత గౌరవమన్నారు. తమ సామర్ధ్యం మేరకు తమ కార్మికులకు తగిన శిక్షణ అందించేందుకు చర్యలను తీసుకోవడంతో పాటుగా వారికి తగిన భద్రతను సైతం అందించడం ద్వారా నూతన పార్లమెంట్‌ భవంతికి అత్యాధునిక వసతులు కల్పించేందుకు కృషి చేశామన్నారు. స్వయంగా కార్పెంటర్‌ను అయిన తాను, నైపుణ్యాభివృద్ధి, సామర్ధ్యం మెరుగు పరుచుకోవడంలో సర్టిఫికేషన్‌ విలువను గుర్తించానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement