హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతూ, వైఎస్ ఆర్ తనయ షర్మిల చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కోవిడ్ వైరస్ దృష్ట్యా మాస్క్ ధరించి దీక్ష చేస్తున్నారు. దీక్షలో ఉన్న షర్మిలకు డాక్టర్లు పరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. షర్మిలను కలవడానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఎవరూ ఇక్కడికి రావొద్దని ఆమె టీమ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉంటే షర్మిల దీక్షలో పాల్గొన్న పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో షర్మిల టీమ్ అప్రమత్తమైంది… షర్మిల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు.. అలాగే గత మూడు రోజుల నుంచి షర్మిలతో ఉన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని టీమ్ కోరింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement