Monday, June 24, 2024

HYD: క్వాంటం డాట్ ఫీచర్‌తో 2024 క్యూ ఎల్ఈడీ 4కే ప్రీమియం టీవీ సిరీస్‌ను ప్రారంభించిన శాంసంగ్

హైద‌రాబాద్: శాంసంగ్ భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. భారతదేశంలో రూ. 65,990 ప్రారంభ ధరతో 2024 క్యూఎల్ఈడీ 4కే టీవీ సిరీస్‌ను ప్రారంభించింది. 2024 క్యూఎల్ఈడీ 4కే టీవీ శ్రేణి అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. 2024 క్యూఎల్ఈడీ 4కే టీవీ మూడు సైజులు – 55, 65, 75లలో లభిస్తుంది.

ఈరోజు నుండి శాంసంగ్.క‌మ్, అమెజాన్.ఇన్ తో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది అందుబాటులో ఉంది. ఈసంద‌ర్భంగా శాంసంగ్ ఇండియా విజువ‌ల్ డిస్ ప్లే బిజినెస్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్, మోహ‌న్ దీప్ సింగ్ మాట్లాడుతూ…. వినియోగదారులు మరింత లీనమయ్యే, ప్రీమియం వీక్షణ అనుభవాన్ని డిమాండ్ చేయడంతో గత కొన్ని సంవత్సరాలుగా కంటెంట్ వినియోగం వేగంగా మారిందన్నారు.

ఈ డిమాండ్‌ను తీర్చడానికి తాము 2024 క్యూఎల్ఈడీ 4కే టీవీ సిరీస్‌ని ప్రారంభించామన్నారు. ఇది ప్రీమియం, మెరుగైన వీక్షణ అనుభవాల ప్రపంచంలో ఒక మెట్టును అధిగమించిందన్నారు. కొత్త టీవీ సిరీస్ 4కే అప్‌స్కేలింగ్ ఫీచర్‌తో లైఫ్ లాంటి పిక్చర్ క్వాలిటీని అందిస్తుందన్నారు. ఇది స్క్రీన్‌పై కంటెంట్‌ను 4కే స్థాయిలకు మెరుగు పరుస్తుందన్నారు. మొత్తం వీక్షణ అనుభవాన్ని అనేక మెట్లు పైకి తీసుకువెళుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement