Saturday, April 20, 2024

భద్రాద్రి తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కు అందజేసిన సజ్జనార్

ఈ నెల 10న శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ ముత్యాల తలంబ్రాలను టి.ఎస్.ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.ఎల్.ఎ కు సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ సజ్జనార్, ఐ.పి.ఎస్ అందజేశారు. గురువారం ఆయన బస్ భవన్​లో ఛైర్మన్ ను కలిశారు. శ్రీరామ నవమి కంటే ముందు ఛైర్మన్ కోటి గోటి ముత్యాల తలంబ్రాల కోసం బుక్ చేసుకోగా ఆ మేరకు వాటిని సంస్థ వి.సి అండ్ ఎం.డి ఆయనకు అందజేశారు. భద్రాచలం తలంబ్రాల కోసం 88,704 మంది భక్తులు టి.ఎస్.ఆర్టీసీ సేవల్ని వినియోగించుకున్నారని, ఈ సేవల ద్వారా రూ.70 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఎం.డి ఛైర్మన్ కు వివరించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ బాజిరెడ్ఢి గోవర్ధన్ మాట్లాడుతూ…. ప్రప్రథమంగా భక్తుల సౌకర్యార్ధం తలంబ్రాల బుకింగ్ ద్వారా డోర్ డెలివరీ సేవల్ని అందించడం జరుగుతోందన్నారు. అంతకుముందు మేడారంకు భక్త జనుల మొక్కు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించడంతో పాటు తిరిగి ప్రసాదాన్ని అందజేసిన ఘనత టి.ఎస్.ఆర్టీసీకే దక్కతుందన్నారు.
కోటి గోటి తలంబ్రాలు అందుకున్న వి.సి అండ్ ఎం.డి :
అదేవిధంగా భద్రాచలం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలను సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ అందుకున్నారు. వి.సి అండ్ ఎం.డి కి ఆయన ఛాంబర్ లో సంస్థ సి.ఒ.ఒ రవీందర్ ఐపిఎస్, కార్గో, పార్శల్ సేవా విభాగం బిజినెస్ హెడ్ జీవన్ ప్రసాద్ తో కలిసి తలంబ్రాలను అందజేశారు. భక్తుల నుంచి ఈ సేవలను ఆదరణ బాగా లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తలంబ్రాల సేవల్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు, పార్శల్ సర్వీస్ ఏజెంట్లతో పాటు అధికారులను కూడా అభినందించారు. మేడారం మొక్కు బంగారం, భద్రాచలం ముత్యాల తలంబ్రాల పంపిణీ పుణ్య కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ తన వంతు సహాకారాన్ని అందించినందుకు గానూ సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్పారు. ఎప్పుడూ ప్రజా ప్రయోజనం కోసం ఆలోచించే టి.ఎస్.ఆర్టీసీ రవాణా సేవల సదుపాయాల్ని మరింత మెరుగు పరిచే దిశలో తగు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంటూ సంస్థను మరింత ఆదరించాలని వి.సి అండ్ ఎం.డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement