Thursday, April 18, 2024

బంజారాహిల్స్‌లో రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొట్టిన అంబులెన్స్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వైపు వ‌స్తున్న అంబులెన్స్.. రోడ్డు నంబ‌ర్ 2 వ‌ద్ద‌కు రాగానే లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అంబులెన్స్ డ్రైవ‌ర్ న‌ర‌సింహ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో అంబులెన్స్‌లో ఎవ‌రూ లేరు. కేవ‌లం డ్రైవ‌ర్ మాత్ర‌మే ఉన్నారు. ఈ ప్ర‌మాదంతో అక్క‌డ కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement