Friday, March 15, 2024

అరుదైన మొయా వ్యాధికి టిఎక్స్ హాస్పిటల్లో చికిత్స!

ఆరునెలలుగా మొయా మొయా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముప్పై నాలుగు సంవత్సరాల యువతికి బంజారా హిల్స్ టిఎక్స్ హాస్పిటల్ కు చెందిన వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి మళ్ళీ మామూలు మనిషిని చేసారు. ప్రధానంగా ఈ వ్యాధి బారిన పడినవాళ్ళకి తరుచుగా మూర్ఛ రావడం.. మెదడులో ఓ వైపు రక్త ప్రసరణ తగ్గి శరీరం ఎడమ భాగం లేదా కుడి బాగంలో నీర‌సంగా ఉండటం లాంటివి జరుగుతాయి. వంశపార్యపరంగా సంక్రమించే ఈ జబ్బుని హైదరాబాద్ లోనే అతి తక్కువ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉండే డైరెక్ట్ వ్యాస్కులర్ అనస్టోమోసిస్ (ఎస్.టి.ఏ-ఎమ్.సి.ఏ బైపాస్) అనే క్లిష్టమైన ప్రక్రియ ద్వారా నయం చేయడం జరిగింది.

హాస్పిటల్లో చేరిన ఐదోరోజు తర్వాత, అంటే సరిగ్గా ఈనెల 16న డిస్చార్జ్ అయిన పేషెంట్ ఇంక తన రోజు వారి కార్యక్రమాలని ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని ఈ ఆపరేషన్ చేసిన బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డా.నరేష్ కుమార్ గజ్జల (గోల్డ్ మెడలిస్ట్), డా.ఎ. రాజేష్, అనెస్తీషియిస్ట్ డా. అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఇంతటి క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా టిఎక్స్ హాస్పిటల్ చెయ్యడం వల్ల ఈ వ్యాధి బారినపడి ఇబ్బంది పడుతున్న వారికి చికత్స ఉందని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవ్వగలిగామ‌ని చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ వొడ్నాల, డా. అస్నా, కిషోర్ కుమార్ అలానే డైరెక్టర్స్ డా. కీర్తికర్ రెడ్డి, దీపక్ రాజు ఇంకా మిస్టర్, రవీంద్రా రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement