Saturday, October 12, 2024

HYD: ఆరోగ్య భద్రతనిచ్చేది… సీఎం సహాయ నిధి: కెపి.వివేకానంద్

కుత్బుల్లాపూర్ : సీఎం సహాయ నిధి ఆరోగ్య భద్రతనిచ్చేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. ఈరోజు పేట్ బషీరాబాద్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 125 – గాజులరామారం డివిజన్ కైసర్ నగర్, హెచ్ఏఎల్ కాలనీలకు చెందిన బుట్టి, సంపూర్ణల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బుట్టి తండ్రి జోషెడ్ (రూ.50,000/-), సంపూర్ణ భర్త పి.వెంకటేశ్వర రెడ్డి (1,10,000/-) లకు మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement