Saturday, October 5, 2024

పొంగులేటి , జూపల్లి బిజెపిలో చేరే అవ‌కాశాలు త‌క్కువ – ఈట‌ల‌

హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేర‌డం క‌ష్ట‌మేన‌ని బిజెపి రాష్ట్ర చేరిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ ,హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు..హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ,. వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయి. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగాను’’ అని ఈటల అన్నారు. దీంతో పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌యింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement