Friday, October 11, 2024

PhonePe : ఇకపై తెలుగులో వాయిస్‌ పేమెంట్‌ నోటిఫికేషన్లు

హైదరాబాద్‌ : ఫోన్‌పే తన స్మార్ట్‌ స్పీకర్లలో వాయిస్‌ పేమెంట్‌ నోటిఫికేషన్లను తెలుగులో వినగలిగే ఫీచర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ల గురించి ఫోన్‌పేలో ఆఫ్‌లైన్‌ బిజినెస్‌ విభాగానికి అధిపతి అయిన వివేక్‌ లోహ్‌చెబ్‌ మాట్లాడుతూ… డిజిటల్‌ పేమెంట్లను దేశం నలుమూలలా తీసుకెళ్లాలనేదే తమ ప్రయత్నమన్నారు. దీనిలో భాగంగా వ్యాపారులు ప్రస్తుతం ఎదుర్కొంటు-న్న అనేక సమస్యలను పరిష్కరించి, తద్వారా తమ స్మార్ట్‌ స్పీకర్‌ పరికరాలను వ్యాపారులు అత్యుత్తమ రీతిలో వినియోగించేలా చేయడమే లక్ష్యంగా పెట్టు-కున్నామన్నారు. ఈ ధ్యేయంలో భాషా పరమైన సవాళ్లను పరిష్కరించడం కూడా ఒక భాగమన్నారు. పేమేంట్ల నిర్ధారణ కోసం డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యాపారి తమ పరికరాలను వినియోగించుకోగలిగేలా చేయడానికి వ్యాపారులకు ఉండే ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు తమ సేవలను లోకలైజ్‌ చేసి, అందరికీ అనుకూలంగా మార్చుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement