Thursday, May 19, 2022

వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం : మంత్రి తలసాని

ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోని నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మయూర్ మార్గ్, బ్రాహ్మణవాడిలలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, ఎలెక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీడిమెట్ల, బాలానగర్, ఫతే నగర్‌ల మీదుగా ఉన్న బేగంపేట నాలాకు ఎగువ నుంచి వచ్చే వరదముంపు సమస్యను పరిష్కరించేందుకు గాను బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్, ప్రకాష్ నగర్ కూకట్‌పల్లి నాలాపై రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement