Thursday, December 1, 2022

Breaking : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని, పాలనలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ బైపోల్స్‌లో బీజేపీ ఘన విజయం సాధించిందని, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లోనూ చెప్పుకోదగ్గ సీట్లు సాధించామన్నారు. మునుగోడులో కూడా టఫ్‌ ఫైట్‌ ఇచ్చామని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేందుకు ఇదే సంకేతం అన్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో బీజేపీని బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తున్నామన్నారు. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వారికి విమరిస్తామన్నారు. సీనియర్‌ నాయకులతో చర్చించి ఇంది స్థాయి పార్టీ నేతలకు ఎలా పనిచేయాలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఆదరణ ఉందని, వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాలని పార్టీ సీనియర్‌ నాయకులు సూచించడం జరిగిందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement