Sunday, February 5, 2023

అబ్బుర ప‌రిచేలా తెలంగాణ ప‌థ‌కాలు..

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి అధికారుల నివేదిక
కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సభ్యుల సమీక్ష

గ్రేటర్‌ హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: కేంద్ర ప్రభు త్వం నుంచి మంజూరైన నిధులు, పథకాల ద్వారా మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే పథకాల అమలు తీరును కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్‌ వ్యవహారాల పార్లమెం టరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలించింది. హైదరాబాద్‌కు విచ్చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ- సభ్యులు కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును సమీక్షిం చారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు- చేసిన ఈ సమావేశంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం కమిటీ- సభ్యు లు గృహ నిర్మాణం, స్వచ్ఛ భారత్‌, అమృత్‌, హెచ్‌ ఆర్‌ఎంఏ, జలమండలి, వివిధ బ్యాంకు అధికారులతో సమీక్షించారు. పార్లమెంటరీ కమిటీ- సభ్యులకు రాష్ట్ర ంలో అమలు చేస్తున్న పథకాలు, ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం గురించి సీఎస్‌ వివరిస్తూ తెలం గాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు- ఎవెన్యూ ప్లాంటేషన్‌ పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. తద్వారా గణనీయంగా అటవీ విస్తీర్ణం పెంపొందించామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పచ్చదనం గణనీ యంగా పెరిగిందన్నారు. ఏడుశాతం అదనంగా పెరిగి నట్లు-, ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించిన విష యాన్ని సభ్యులకు శాంతికుమారి వివరించారు.

- Advertisement -
   

ఇంక్రిమెంటల్‌ గ్రీన్‌ కవరేజ్‌ కింద చేపట్టిన అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లో భాగంగా 177 అర్బన్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ బ్లాకులను ప్లాంటేషన్‌ చేపట్టి, 20 కోట్ల ప్లాంటేషన్‌ పూర్తి చేశామన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందని సీఎస్‌ వివరించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పునరుద్ధరణ, స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ పెద్ద ఎత్తున అం దిస్తున్నామని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్గదర్శ కత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు తీరుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను గురించి, ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పార్లమెంట్‌ కమిటీ- సభ్యులకు వివరించారు. మున్సిపల్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ చట్టం ద్వారా అర్బన్‌ లోకల్‌ బాడీ సంఖ్యను 68నుండి 142కు పెంచామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సువిశాల రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు-, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు-, వైకుంఠధామాలు, ఓపెన్‌ జిమ్స్‌, స్టేడి యాలు, గ్రీనరీ, ఆన్‌లైన్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌లు, అర్బన్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌, స్మార్ట్‌సిటీలు-గా వరంగల్‌, కరీంనగర్‌ తీర్చిదిద్దడం, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌లకు బ్యాంకు లింకేజీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ల కేటాయింపు తదితర పథకాల పురోగతిని వివరించారు. ప్రభుత్వ పక్కా ప్రణాళికతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు అభి వృద్ధిపథంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. సఫా యి కర్మచారి, స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నాయని అరవింద్‌ కుమార్‌ తెలిపారు. మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లా డుతూ శానిటేషన్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ అసెస్‌ మెంట్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రీసైక్లింగ్‌ డంప్‌యార్డ్‌, కంపోస్ట్‌ చర్య లను పెద్దఎత్తున చేపట్టామని, చెత్తతో సంపద సృష్టించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.

జల మండలి ఎండీ దాన కిషోర్‌ మాట్లాడుతూ కాంప్రహెన్సివ్‌ సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ అనుసరించి ఆగస్టు నాటికి 100శాతం సీవరేజ్‌ ట్రీ-ట్‌మెంట్‌ ప్లాం ట్లను పూర్తి చేస్తామన్నారు. ప్రధానమంత్రి స్వనిధి కింద వీధి వ్యాపారులకు అందిస్తున్న రుణాలపై వివరాలను బ్యాంకర్లు వివరించారు.

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌.రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ నుండి మియాపూర్‌ వరకు, జేబీఎస్‌ నుండి ఎంజీబీఎస్‌ వరకు, నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు ఎలివే-టె-డ్‌ మెట్రో నిర్మాణాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో రాయదుర్గం నుండి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైల్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. మెట్రో రైల్‌ పొడిగింప ుకోసం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.254 కోట్లు- మంజూరు చేయాలని కోరారు.

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ- చైర్‌పర్సన్‌ లాలన్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంజయ్‌ సింగ్‌, రామలింగం, బండి సంజయ్‌ కుమార్‌, ఆరిఫ్‌, శ్రీరంగ అప్ప బార్‌ని, బెన్ని బెన్హనన్‌, రామ్‌ చరణ్‌ బోహర, హిబ్బి హిడెన్‌, గౌతమ్‌ గంభీర్‌, జలీల్‌, శంకర్‌ లల్వాని, హేమమాలిని, మసూది, మోహన్‌, పాటిల్‌, ప్రభాకర్‌రెడ్డి అపరాజిత సరాగి, సత్యనారాయణ, సుధాకర్‌, సునీల్‌కుమార్‌ ఠాకూర్‌, రాజ్యసభ సభ్యులు సుభాష్‌ చక్రబోర్తి, గిరి రాజన్‌, జిబి మాతర్‌ హిషం చందర్‌ జాగ్ర, కుమార్‌ కేట్కర్‌ లక్ష్మణ్‌, కవిత పాటీ-ధర్‌ నిరంజన్‌ రెడ్డి కల్పనా సానిలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌. లోకేష్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సెక్రటరీ నీతూప్రసాద్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌, రోడ్లు భవనాల శాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ ఓఎస్డీ సురేష్‌ కుమార్‌, వివిధ బ్యాంక్‌ ఉన్నతాధికారులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement