Wednesday, May 19, 2021

ఒడిశా నుంచి ఆక్సిజ‌న్ ఎక్స్ ప్రెస్ వ‌చ్చేస్తోంది…

హైద‌రాబాద్ : కొవిడ్ -19 మహమ్మారి విజృంభ‌న రెండో ద‌శ‌లో మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని తీర్చేందుకు భారత రైల్వే 63.6 టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను తెలంగాణకు సరఫరా చేస్తోంది. ద్రవ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే రైలు శనివారం ఉదయం ఒడిశాలోని అంగూల్ నుండి సికింద్రాబాద్‌కు బ‌య‌ల్దేరింది. ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా రైలు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. రేక్‌లో ఐదు ద్ర‌వ ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు మొత్తం 63.6 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను రాష్ట్రానికి తీసుకువ‌స్తున్న‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News