Friday, April 19, 2024

కంటి వెలుగును స‌ద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి త‌ల‌సాని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర ప్రజలను కోరారు. అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మొదటి విడతలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 1.54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కళ్ళద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు. రెండో విడతలో జూన్ 30వ తేదీ వరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్ లు చేయించడం జరుగుతుందని వివరించారు. కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, కాలనీలు, బస్తీల కమిటీల సభ్యులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మీ మీ ప్రాంతాల్లో భాగా ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 115 శిభిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అవసరాన్ని బట్టి అదనపు శిభిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement