Friday, March 29, 2024

ఆత్మ స్థైర్యాన్ని కోల్పొవద్దు-ఆత్మహత్యలకు పాల్పడవద్దు..

మోండా : విద్యార్థులు. నిరుద్యోగులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పొయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హక్కుల సాధనకోసం సమైక్యంగా పోరాడదాం అని టీ టీడీపీ నాయకుడు గౌరీశంకర్‌ యాదవ్‌ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేఖిస్తూ ఆత్మహత్య చేసుకున్న పట్టబధ్రుడు సునీల్‌ నాయక్‌ చిత్రపటానికి సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద తెలుగుదేశం నాయకులు పూల మాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్ళు, నియామాకాల కోసం ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు అసమర్ధ పాలకుల కారణంగా నిరుద్యోగ సమస్య నానాటికి తీవ్రరూపం దాలుస్తుందన్నారు. రాష్ట్రంలో లక్ష 90వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, నేటికి ఏఒక్క పోస్టుకు నోటిఫికేషన్‌ జారీ చేయక పోవడం తెలంగాణ పాలకుల అసమర్ధతను తెలియ చేస్తుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాందేవ్‌, నర్సింగరావు, దత్తుబాయి, బాబు, రాజు, రాజశేఖర్‌, సుందర్‌, మోహిన్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement