Saturday, October 12, 2024

రాజమండ్రిలో నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ను ప్రారంభించిన నికాన్‌

ఇమేజింగ్‌ టెక్నాలజీలో అగ్రగామి నికాన్‌ కార్పోరేషన్‌కు 100శాతం అనుబంధ సంస్థ అయిన నికాన్‌ ఇండియా, తమ నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ప్రారంభించింది. ఇది జైన్‌ డిజిటల్‌ షాపీ, స్టేడియం రోడ్‌, ఇన్నీస్‌పేట వద్ద ఉంది. ఈ ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ను నికాన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ ప్రతిభకు నికాన్‌ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులతో కూడిన నిధిని ఈ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ సందర్భంగా సజ్జన్‌ కుమార్‌ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నికాన్‌ నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. వైవిధ్యమైన సంస్కృతి, వారసత్వంకు సుప్రసిద్ధి రాజమండ్రి అన్నారు. భారతదేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తోన్న వేళ, భారతీయ ఫోటోగ్రఫీ కమ్యూనిటీకి మద్దతు అందించాలనే తమ నిబద్ధతకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు వినోదాత్మక, అనుసంధానిత అనుభవాలను అందించనుందని ఆశిస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో ఆధునిక మీడియా, యువత కేంద్రీకృత సంస్కృతి స్థిరంగా పెరుగుతుండటంతో సృజనాత్మక వ్యక్తీకరణకు వినూత్న అవకాశం కలుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement