Friday, March 29, 2024

మావోయిస్ట్ సానుభూతిప‌రుల ఇళ్ల‌లో ముగిసిన ఎన్ ఐ ఎ సోదాలు…

హైద‌రాబాద్/అమ‌రావ‌తి – తెలుగు రాష్ట్రాల‌లోని మావోయిస్ట్ సానుభూతిప‌రులు, ప్ర‌జా సంఘాల నేత‌ల ఇళ్ల‌పై ఎన్ ఐ ఎ రెండు రోజుల పాటు నిర్వ‌హించిన సోదాలు ముగిశాయి.. ఈ సోదాల‌లో భారీగా మొబైల్స్, న‌గ‌దు, విప్ల‌వ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.. వాటి వివ‌రాల‌ను ఎన్ ఐ ఎ ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు వెల్లడించింది. ఏపీలో శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పు గోదావరి, కర్నూలు, కడప, కృష్ణా, గుంటూరు… తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో సోదాలు చేసినట్టు వివరించింది. ఈ సోదాల్లో 40 మొబైల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్కులు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్ లు, ఒక ఆడియో రికార్డర్, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇవే కాకుండా కొన్ని ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. కాగా, మావోయిస్ట్ కీల‌క నేత ఆర్కే భార్య ప‌ద్మ నివాస‌ముంటున్నఎపి ప్ర‌కాశం జిల్లా టంగుటూరు మండ‌లం ఆల‌కూర‌పాడు గ్రామంలోని ఇంట్లో నిన్న, ఇవాళ అధికారులు సోదాలు చేశారు. వెంట తీసుకువచ్చిన పత్రాలపై ఆర్కే భార్యతో సంతకాలు చేయించుకున్నారు ఎన్ఐఏ అధికారులు…విచారణకు విజయవాడ ఎన్ఐఏ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement