Thursday, April 25, 2024

ముగ్గుల పోటీలు సాంప్రదాయాలకు ప్రతీకలు… ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

ముగ్గుల పోటీలు సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలు అని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని, ఐసిఐసిఐ బ్యాంక్ పక్క లైన్ చైతన్యపురిలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-ఐవీఎఫ్ స్టేట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో గెలుగుపొందిన వారికి బహుమతులుగా చీరలను అందజేశారు. అలాగే పాల్గొన్న అంద‌రికీ కూడా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. మహిళలు ఉదయం పూట ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం మంచి వ్యాయామమ‌న్నారు. దీంతోపాటు మహిళల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ముగ్గుల పోటీలు ఐక్యతకు, ఆప్యాయతకు నిదర్శనమ‌న్నారు.

మన తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. గంజి రాజమౌళి గుప్త ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్- ఐవీఎఫ్‌ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యూఢిల్లీ, ఐవీఎఫ్‌ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ఐవీఎఫ్‌ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ కోశాధికారి కొడిప్యాక నారాయణ గుప్తా, ఐవీఎఫ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, సెక్రటరీ లెంకల పల్లి మంజుల రాజు, ట్రెజ‌రర్ గుడిపాటి భువనేశ్వరి, చీఫ్ అడ్వైసర్ కలకొండ మణిమాల, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) మహిళా విభాగం సభ్యులు, ఐవీఎఫ్‌ నాయకులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement