Sunday, April 11, 2021

తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం..

కొత్తూర్‌ : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ తరుపున తిమ్మాపూర్‌ మాజీ ఎంపిటిసి నర్సింహాగౌడ్‌, సినియర్‌ నాయకులు నాగరాజు చారీ ఆధ్వర్యంలో రెండో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి, యువ నాయకులు మిథున్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని కొత్తగా ఏర్పాటు అయిన కొత్తూర్‌ మున్సిపాలిటీలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని వారు అన్నారు. కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. అలాగే వృద్ధులకు.. వితంతువులకు కోత్త పెన్షన్‌ లు వెంటనే ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌ గౌడ్‌, బిజేపి నాయకులు రాఘవులు, యువమోర్చా జిల్లా కార్యదర్శి రణదీర్‌ గౌడ్‌, మల్లేశం, శ్రీనివాస్‌లు, రాఘవేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సురేందర్‌, విజయ్‌లు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News