Friday, April 26, 2024

ములాయం సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన‌ మంత్రి తలసాని

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారని, ఎనలేని సేవలందించార‌ని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ములాయం మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.


అంత్యక్రియలకు హాజరుకానున్న మంత్రి తలసాని :
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా సైఫమ్ లో 11వ తేదీన నిర్వహించే మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. ముందుగా ములాయం సింగ్ యాదవ్ పార్ధీవదేహం వద్ద నివాళులర్పించి అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement