Thursday, March 28, 2024

పోడు భూముల స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం … మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

హైద‌రాబాద్ : మంత్రివర్గం, అధికారుల సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేసి త్వ‌ర‌లోనే పోడు భూముల సమస్యలను పరిష్కారం చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇచ్చారు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. అంతవరకు పోడు భూములు జోలికి వెళ్లవద్దని గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దని అట‌వీ శాఖ అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చామ‌ని గుర్తు చేస్తూ అయినా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతున్నార‌ని పేర్కొన్నారు… శాస‌న‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో గిరిజన రైతుల పోడు భూముల సమస్యలపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌త్య‌వ‌తి స‌మాధానం ఇచ్చారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 2008 నుంచి 303970 ఎకరాలలో అర్హులైన 94,774 మంది హక్కుదారులకు పట్టాలను ఇవ్వడం జరిగింద‌న్నారు ఈ చట్టం చేసినప్పటి నుంచి 6, 3, 850 ఎకరాలకు సంబంధించి 1, 84,730 క్లెయిమ్స్ అందాయి. అందులో క్షేత్రస్థాయి విచారణ చేసి అర్హులైన వ్యక్తులకు పట్టాలను జారీ చేశామ‌న్నారు. ధరణి పోర్టల్లో భూములను ఎక్కించడం, రైతుబంధు కొంతమందికి అందకపోవడం, హరితహారం కింద అడవుల్లో చెట్లను పెంచుతూ, అటవీ సంరక్షించే చర్యలు చేపట్టడం వల్ల ఆందోళన పోడు భూముల గిరిజన రైతుల్లో ఇటీవల ఆందోళన ఎక్కువ అయ్యింద‌న్నారు.. వాట‌న్నింటికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు అని మంత్రి స‌త్య‌వ‌తి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement