Friday, March 29, 2024

కండ్ల‌కోయ ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్‌ శివార్లలోని కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ గేట్‌వే పేరుతో నిర్మిస్తున్న ఈ ఐటీ పార్కును కండ్లకోయలోని 10.11 ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండనున్న ఈ ఐటీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.250 కోట్లు వెచ్చించనునన్నది. దీంతో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద‌, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement