Saturday, April 20, 2024

కేసీఆర్ చిత్రపటానికి మేయర్ విజయలక్ష్మి పాలాభిషేకం

హైదరాబాద్, మే 2 (ప్ర‌భ న్యూస్) : మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 పెంచిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి మంగళవారం కేసీఆర్ చిత్రపటానికి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచడం సాహోసపేత నిర్ణయమన్నారు. కార్మికులకు నెలనెలా అందుతున్న జీతానికి అదనంగా మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించార‌న్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచలేదని, మ‌న సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులు చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఇతర శాఖలైన మెట్రో, వాటర్ వర్క్స్ తో పాటుగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 1,06,474 మందికి లబ్ధి చేకూరుతుందని, ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 39, 40 లను విడుదల చేసిందన్నారు. రాష్టానికి ఆర్థిక భారమైనా వెనుకాడకుండా కార్మికులకు మెరుగైన జీవనం కొనసాగించేందుకు తీసుకున్న గొప్ప నిర్ణయమని అందుకు ముఖ్యమంత్రికి మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement