Thursday, April 25, 2024

వ్యక్తిపై కత్తితో దాడి..

హైదరాబాద్‌ : చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వహీద్‌ అనే వ్యక్తిపై దిల్షాన్‌ కత్తితో దాడి చేశాడు. దాడిలో వహీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement