Thursday, April 25, 2024

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి….మధు యాష్కీ గౌడ్ లేఖ

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మీరు రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధు యాష్కీ గౌడ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయికనే కాంగ్రెస్ పార్టీ అన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు దేశ స్వాతంత్ర పోరాటంలోనూ, అనంతర దేశ నిర్మాణంలోనూ చారిత్రాత్మక పాత్ర పోషిస్తూ.. అగ్రకులాలకు, బహుజనులకు, ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్ష, కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించిందని లేఖ‌లో తెలిపారు. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం.. పార్టీ ముఖ్యం.. అన్ని పదవులు పొంది రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసి అధినాయకత్వాన్ని బలహీన పర్చాలని చూసినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మాత్రం చేరదీసి దగ్గరకు తీసుకుని కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి ఎంతోమందిని నాయకులను, ముఖ్యమంత్రులను, కేంద్ర-రాష్ట్ర మంత్రులను, గవర్నర్లు, ఏఐసీసీ, పీసీసీ అధక్షులుగా పదవులిచ్చిందని మ‌ధు యాష్కీ గౌడ్ లేఖ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement