Saturday, April 20, 2024

లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు..

అల్వాల్‌ : పట్టణ పరిధిలోని కానాజీగూడలో వెలసిన ప్రసిద్ద మరకత శ్రీలక్ష్మీగణపతి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు డాక్టర్‌ సత్యనారాయణశాస్త్రి నేతృత్వంలో మరకత శ్రీల క్ష్మీగణపతిస్వామి వారికి విశేష అభిషేకాలు, హోమం, కలశస్థాపన, గోపూజలను వైభవంగా నిర్వహించారు. నేడు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటుగా హోమం ఉంటుందని సత్యనారాయణశాస్త్రి వెల్లడించారు. కోవిడ్‌-19 నిబంధనలను అనుసరించి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడ జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సంక్షేమార్థం స్వామివారికి నిత్యం పూజలను చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement