Tuesday, March 26, 2024

వేలంలో రూ.56 వేలు పలికిన గణేష్ లడ్డూ

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం భక్తుల కోలహలం మధ్య కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కిస్మత్ పూర్ లోని యాదాద్రి కాలనీలో వినాయకుడి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి కాలనీలో నిర్వహించిన లడ్డూ వేలంలో రికార్డులో స్థాయిలో రూ.56 వేలు పలికింది. ఏటా యాదాద్రి గణేష్ ఉత్సవ్ కమిటీ అధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా మట్టి నినాయకుడిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజించారు. కాలనీలో కులమతాలకు అతీతంగా కాలనీవాసులందరూ కలిసి కాలనీ మండపంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి భక్తిప్రపత్తులతో కాలనీవాసులు ఐదురోజుల పాటు పూజలు చేశారు. 5వ రోజు నిమజ్జనం సందర్భంగా నిర్వహకులు లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన సత్యనారాయణ కుటుంబం రూ.56 వేలకు స్వామి వారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ శాలువతో సత్కరించి లడ్డూను అందజేసింది. గతంలో కంటే ఈ సారి ధర రికార్డు స్థాయిలో పలికిందని నిర్వహకులు తెలిపారు. వినాయకుడి పూజల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంతో పాలు పంచుకున్నారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్, శంకర్ నాయక్, రాములు నాయక్, అమర్ నాథ్, రఘు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement