Friday, March 29, 2024

ఎన్నిక‌ల చ‌ట్టాల‌పై ‘స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళి’ని పాటిస్తున్న కూ యాప్

సోషల్ మీడియాలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన చర్చను సురక్షితంగా ఉంచే దిశగా, దేశంలోని మొట్టమొదటి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ‘వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పాటిస్తుంది. మొదటిసారిగా, ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళిని 2019 సాధారణ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఈ ప్రవర్తనా నియమావళి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను నిష్పక్షపాతంగా, నైతికంగా ఉపయోగించడం కోసం ఫిబ్రవరి అండ్ మార్చి 2022 మధ్య ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళిని అనుసరించడం ద్వారా, కూ యాప్ అనేది వినియోగదారులకు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ సురక్షితమైన, న్యాయమైన ఎన్నికలకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తుంది. అదే సమయంలో కూ బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వేదికగా వ్యవహరిస్తుంది.

ఈసంద‌ర్భంగా కూ యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… ప్రజల జీవితాల్లో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎన్నికల ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో వారిని ప్రభావితం చేయడంలో ఉపకరిస్తుందన్నారు. నిష్పాక్షికమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారంగా, ఐఏఎంఐఏ రూపొందించిన స్వచ్ఛంద నియమావళి, స్ఫూర్తికి, అందులో ఉన్న ప్రతి అక్షరానికి కూ కట్టుబడి ఉంటుందన్నారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలను జరిపేందుకు కృషి చేస్తుందన్నారు. ఇది ఏ ప్రజాస్వామ్యానికైనా ముఖ్య లక్షణమ‌న్నారు. త‌మ‌ బెస్ట్-ఇన్-క్లాస్ కంప్లయన్స్, ఫిర్యాదుల పరిష్కార విధానాలు యూజర్లకు వారి ఆలోచనలను వ్యక్తీకరించడానికి, వారి కమ్యూనిటీలతో తమకి నచ్చిన భాషలో కనెక్ట్ అవ్వడానికి సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని అందిస్తాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement