Saturday, December 7, 2024

రేపు కొండ పోచ‌మ్మ ప్రాజెక్ట్ కు కెసిఆర్..

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్‌ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులూ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement