Sunday, May 29, 2022

నీటి నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత ప‌టిష్టం….కెసిఆర్

ప్రతిసాగు నీటి కాల్వ అద్దంలా మెరవాలి
త్వరలో పాలమూరు-కల్వకుర్తి- జూరాల నీళ్ళు
అనుసంధానంపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘకసరత్తు
ఆర్‌డీఎస్‌ వాటా జలాల కోసం అవసరమైతే
కర్ణాటకకు వెళ్తా శ్రీ పాలమూరు, రంగారెడ్డిలోని
ప్రతి చేనూ తడిసేలా.. ప్రణాళిక శ్రీ డిజిటల్‌ స్క్రీన్‌పై కాంటూర్‌లను గుర్తించిన సమీక్ష
అర్ధరాత్రి దాకా కొనసాగిన సమీక్ష

హైదరాబాద్‌, : రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ శాఖ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ దాకా, నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెళ్ళే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల నిర్మాణాలు, వ్యవ స్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాల న్నారు. ఉత్పన్న మయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించు కుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమ త్తుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియో గించుకోవాలని సీఎం తెలిపారు. ఇరిగేషన్‌ శాఖను నీటిపారు దలతో పాటు, నీటిపారుదల రంగ నిర్వహణ శాఖగా పటిష్టంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం వివరించారు. పాల మూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, నిర్మాణాలు విస్తరణ మీద మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్షాసమావేశాన్ని, బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించారు. రాత్రి 11.15వరకు ఈ సమీక్ష సాగింది.
పనివిభజన జరగాలి
సాగునీరు తాగునీరు నీరేదైనా కానీ ఇరిగేషన్‌ శాఖ నీటి పారుదలకు మారుపేరుగా మారింది. నేడు తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్‌ లైన్‌గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కాల్వలు వ్యవహారం అంతా ఆంధ్రా రాష్ట్ర వ్యవహారం అన్నట్టుగా సాగింది. కానీ నేడు తెలంగాణ లో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ యాసంగిలోనే తెలంగాణ 52 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తూ, వరిపంటలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. మనకు పంటలే పండవు అని మనలను తక్కువ చేసి చూసిన పక్క రాష్ట్రం ఇవ్వాల మూడో స్థానంలో వున్నది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సాగునీటి రంగం ఎంత వైబ్రంట్‌గా వున్నదో. ఇంత విస్త్రతమైన నెట్‌వర్క్‌ గతంలో లేకుండె. ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంజనీర్లకు అంతగా అవగాహన కల్పించలేదు, కానీ ఇప్పుడు ఆ అవసరం పెరిగింది. ప్రతి కింది స్థాయి ఇంజనీరుకు కూడా ఇరిగేషన్‌ వ్యవస్థ మీద మరింతగా కమాండింగ్‌ రావాల్సిన అవసరమున్నది.” అని సీఎం అన్నారు. ఈ నేప థ్యంలో ఇరిగేషన్‌ శాఖ పని విభజన మరింతగా చేసుకోవాల్సిన అవసరమున్నది. తరచుగా మీటింగులు జరుపుకోవాలె. వర్కుషాపులు ఏర్పాటు చేసుకోవాలి. మన ఓరియెంటేషన్‌ పెంచుకోవాలె. ఓ అండ్‌ ఎం అంటే ఏమిటి? దాని విస్తృతి ఏమిటి దాని విధి విధానాలేమిటో ఉన్నతాధికారులు కింది స్థాయి ఇంజనీర్లకు కల్పించాలని” సీఎం అన్నారు.
వ్యవసాయమే మొదటి ప్రాధాన్యరంగం
తెలంగాణకు వ్యవసాయమే మొదటి ప్రాధాన్యతారంగం కావడం వల్ల, మెయింటెనెన్స్‌కు ఒక దారి పడాలని తాను ఇంజనీర్ల వద్ద అందుబాటులో నిధులు ఏర్పాటు చేశానని సీఎం కేసీఆర్‌ అన్నారు. తద్వారా పదికాలాల పాటు తెలంగాణ సాగునీటి రంగం అత్యంత పటిష్టంగా తయారవుతుంద న్నారు. తెలంగాణ రైతన్నకు సాగునీటి కష్టాలు ఏ కోణం లోంచి, భవిష్యత్తులో కూడా రాకుండా చేయడమే తన ఉద్దేశ్యం అన్నారు. ఇందులో భాగంగా బ్యారేజీలన్ని గేట్లెన్ని పంపులెన్ని కాలువలెన్ని వాటి పొడవెంత తదితర విషయా లను కూలంకషంగా ఒక చార్టులాగా రూపొందించు కోవాల న్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టుకుంటు న్నప్పు డు వాటిని పటిష్టంగా నిరంతరం అప్రమత్తతో లైవ్‌లో వుంచు కోవడం అనే విషయం మీద స్పృహ తెచ్చుకోవాలె.. అన్నారు.
వర్క్‌షాప్‌ నిర్వహించుకోండి
హైద్రాబాద్‌లో సీఈలు, ఎస్‌ఈల స్థాయిలో వర్క్‌షాప్‌ నిర్వహంచుకోవాలనీ,. క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్లకు శిక్షణనిచ్చే విధంగా, మంచి స్పీకర్లను గుర్తించి శిక్షణనివ్వాలని సీఎం సూచించారు. ఈ శిక్షణా కార్యక్ర మానికి ఒకరోజు తాను కూడా హాజరవుతానని సీఎం తెలి పారు.
కల్వకుర్తి- జూరాలకు అనుసంధానంపై కసరత్తు
పాలమూరు ఎత్తిపోతలను కల్వకుర్తి- జూరాలకు అను సంధానం చేసే కార్యాచరణకు సంబంధించి సీఎం చాలాసేపు కసరత్తు జరిపారు. డిజిటల్ స్క్రీన్‌ మీద పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన రిజర్వాయర్లను వాటి నుంచి నీటిని తీసుకుపోయే కాల్వలను వాటిని నిర్మించాల్సిన ఎత్తు, అందుకు సంబందించిన కాంటూర్‌ పాయింట్లను గుర్తించా రు. తద్వారా అత్యధిక ఎకరాలకు గ్రావిటీద్వారా నీటిని తరలించే విధానాలను ఉన్నతాధికారులతో చర్చించారు. పీఎ్లల, కెఎ్లలల అనుసంధానం ద్వారా మొత్తం పాలమూరు ఉమ్మడి జిల్లా దాన్ని ఆనుకుని వున్న రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలోని నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందిం చాలనే లక్ష్యంతో ప్రతి ఇంచును పరిశీలించిన సీఎం అందుకు తగ్గట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కరివేన రిజర్వాయర్‌ నుంచి జూరాలకు నీటిని తరలించే ప్రధాన మరియు డిస్ట్రిబ్యూటరీ కాల్వల రూట్లను గుర్తించారు. ఉద్దండాపూర్‌ నుంచి కొడంగల్‌, నారాయణపేట్‌, తాండూర్‌, పరిగి, వికారాబాద్‌ చేవెళ్ల నియోజక వర్గాలకు సాగునీటిని తరలించే కాల్వల రూట్లను అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలు పారే విధంగా కాల్వల ఎత్తును నిర్దారించుకోవాలన్నారు. టన్నెల్‌ నిర్మాణాలను తగ్గించి ఓపెన్‌ కెనాల్‌ లను తవ్వాలని, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే విధంగా సాంకేతికతను మరింతలోతుగా పరిశీలిం చాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను తుది దశకు చేర్చే విధంగా సమీక్ష నిర్వహించుకుందామని సీఎం అన్నారు. అందుకు సంబంధించి త్వరలోనే సమావేశమవుదామని, అందుకు తగు ఏర్పాట్లతో సమాయత్తం కావాలన్నారు.
పురోగతిపై చర్చ
గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 88 వేల ఎకరాలకు సాగునీరందించే ఆర్డీఎస్‌ స్కీం పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌లో కేటాయించిన ఆర్డీఎస్‌ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని సాధించుకుందామన్నారు. అందుకు కావాల్సి వస్తే తాను కర్ణాటక ప్రభుత్వంతో స్వయంగా వెళ్లి చర్చించి వస్తానని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో… మంత్రులు సబితారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు, లక్ష్మారెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, అబ్రహం, మహశ్వర్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌ రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, మెతుకు ఆనంద్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌ రావు, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు రమేశ్‌, హమీద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement