Thursday, March 28, 2024

రోజూ క‌రోనాపై మూడు సార్లు స‌మీక్ష – అంద‌రూ అప్ర‌మ‌త్తం – కెసిఆర్ ఆదేశం…

హైద‌రాబాద్ : ఇప్పటి వ‌ర‌కు వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ను నిర్వ‌హిస్తున్న ఈట‌ల రాజేందర్ ను ఆ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించారు..గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌తో కెసిఆర్ ఆ శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టారు..ఇక వైద్యారోగ్య శాఖ త‌న ఆధీనంలోకి రావ‌డంతో క‌రోనా నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి సారించారు. ఆ చ‌ర్య‌ల్లో భాగంగానే త‌న కార్య‌ద‌ర్శి రాజశేఖ‌ర్ రెడ్డిని క‌రోనా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియ‌మించారు. అనంత‌రం కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు స‌మీక్ష జ‌రిపి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజ‌న్, వ్యాక్సిన్, బెడ్ల ల‌భ్య‌త‌లో ఎలాంటి లోపం రానివ్వొద్ద‌ని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి రాష్ర్టాన్ని క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement