Thursday, April 25, 2024

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కెసిఆర్ శ్రీరామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో ఆలయ పూజారులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులు వీక్షించాలని సూచించారు. అలాగే న‌వ‌మి వేడుక‌ల‌ను ఇంటిలోనే జ‌రుపుకోవాల‌ని కెసిఆర్ కోరారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం.. భవిష్యత్‌ తరాలకు ఆదర్శనీయమని సీఎం పేర్కొన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement