Thursday, April 25, 2024

ఇమేజింగ్ మాస్టర్ పీస్ నికాన్ జెడ్ 8ని ప్రదర్శించిన నికాన్

ఇమేజింగ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన నికాన్ కార్పొరేషన్ 100శాతం అనుబంధ సంస్థ, నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త మిర్రర్‌లెస్ ఇమేజింగ్ మాస్టర్ పీస్ నికాన్ జెడ్ 8ని ప్రదర్శించింది. ఈ సరికొత్త ఆవిష్కరణ నికాన్ జెడ్ 8 చురుకుదనం, పోర్టబిలిటీ, వైవిధ్యత, అత్యుత్తమ శ్రేణి ఏఐ – ఆధారిత ఫీచర్ల కలయికతో కూడిన పరిపూర్ణమైన శక్తితో వస్తుంది. ఈ సందర్భంగా నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ కుమార్ మాట్లాడుతూ… త‌మ సరికొత్త వైవిధ్యమైన, వినూత్న హైబ్రిడ్ కెమెరా నికాన్ జెడ్ 8, ఇమేజింగ్ పవర్‌హౌస్‌ను ప్రదర్శించడం త‌మకు ఆనందంగా ఉందన్నారు.

12-బిట్ అంతర్గత 8కే వీడియో రికార్డింగ్, 120ఎఫ్ పీఎస్ వరకు బరస్ట్ స్పీడ్, త‌మ అత్యంత అధునాతన ఆటో ఫోకస్ సిస్టమ్ వంటి అగ్రశ్రేణి ఫీచర్‌లతో కెమెరా కాంపాక్ట్‌నెస్ అండ్ పోర్టబిలిటీని ప్యాక్ చేస్తుందన్నారు. జెడ్ 8 అనేది స్పోర్ట్స్, ఫ్యాషన్, ల్యాండ్‌స్కేప్, వైల్డ్‌లైఫ్, వెడ్డింగ్‌లు, సినిమాటోగ్రఫీ వంటి విభిన్న విభాగాల్లో ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్‌లు, ఫోటోగ్రాఫర్‌ల అవసరాలను తీర్చటానికి ప్రత్యేకంగా రూపొందించబడిన నికాన్ మిర్రర్‌లెస్ శ్రేణికి త‌మ తాజా జోడింపు అన్నారు. సృజనాత్మకత, మెరుగైన పనితీరు, అత్యున్నత శిఖరం జెడ్ 8, సృజనాత్మక వ్యక్తీకరణ, వీడియో స్టోరీ టెల్లింగ్ రంగంలో నూతన ప్రమాణాలను ఏర్పరచటానికి సిద్ధంగా ఉందని, ఇది మన దేశ యువతకు వారి సృజనాత్మకతను మరింత ఉన్నతంగా తీసుకెళ్లడానికి శక్తినిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement