Thursday, April 25, 2024

అసలైన పేగుబంధానికి నిలువెత్తు సాక్ష్యం జీ తెలుగు ‘కళ్యాణం కమనీయం’


అమ్మని మించిన దైవం ఉన్నదా ? అని పాటల్లోనే కాదు నిజజీవితంలో కూడా ప్రతీఒక్కరూ అనుకోకుండా ఉండరు. అలాంటి అమ్మ గురించి జీ తెలుగు ఎప్పుడు కూడా గుండెకు హత్తుకొనే కథలను తనదైన శైలిలో ప్రదర్శించడంలో ప్రఖ్యాతిగాంచింది. అందుకే ఈసారి ఒక వైవిధ్యమైన ధారావాహికతో మన ముందుకి రాబోతుంది. అమ్మ కోసం అన్వేషిస్తున్న ఇద్దరి కూతుళ్ల కథ ఇది. తన పిల్లలని ఏనాటికైనా కలుసుకోవాలనుకునే ఒక అమ్మ వేదన ఈ కథ. అమ్మ ప్రేమ ఎంత నిజమో, నిజమైన ప్రేమ కూడా అంతే అని చెప్పే జీ తెలుగు వారి సీరియల్‌ ‘కళ్యాణం కమనీయం’. జనవరి 31 నుంచి రాత్రి 7:30 గంటలకు మీ అభిమాన ఛానెల్లో ప్రసారం కానుంది.

కథ విషయానికొస్తే, సీతారత్నం (హరి) సాధారణ గృహిణి, ఒక శరణాలయాన్ని నడుపుతుంది. అందరు బాగుండాలని కోరుకొనే మనిషి. మరోవైపు చైత్ర (మేఘన లోకేష్‌), ఫిజియో థెరపిస్ట్‌. తన తండ్రి (సింగర్‌ మనో) ఆఖరి నిమిషంలో తనకు, తన చెల్లికి వారి అమ్మ గురించిన నిజాన్ని వెల్లడిస్తారు. ఈసందర్భంగా హరిత మాట్లాడుతూ… తనకు పుట్టింటికి వచ్చినట్టుగా ఉందన్నారు. అఖిలాండేశ్వరి తర్వాత మన ఛానల్‌ అభిమానులకి సీతారత్నం పాత్రలో కనిపించబోతున్నానన్నారు. తల్లి కోసం పిల్లల అన్వేషణ, తన పిల్లలు ఎక్కడున్నా బాగుండాలి, ఒక్కసారైనా వాళ్ళని కలవాలి, వాళ్ళని చూడాలనే ఒక తల్లి తపనే ఈ కథ అన్నారు. అందరికీ నచ్చుతుందని, సీతారత్నం పాత్రని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానని, సీతారత్నం, చైత్ర, విరాజ్‌ జీవితాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయో తెలియాలంటే కళ్యాణం కమనీయం ఈ జనవరి 31 నుండి రాత్రి 7:30 గంటలకు తప్పకచూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement