Monday, January 30, 2023

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైద‌రాబాద్ న‌గ‌రంలో అక్ర‌మంగా డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న ముఠాల‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయినా డ్ర‌గ్స్ ముఠాలు కొత్త‌కొత్త మార్గాల ద్వారా విక్రయాల‌కు పాల్ప‌డుతూ.. సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్ లో రాచ‌కొండ పోలీసులు డ్ర‌గ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు రాజస్థాన్ నిందితులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే కేజీ ఓపీఎం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో వ్యాపారస్తులకు నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఠా సభ్యులు రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement