Saturday, April 20, 2024

15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే వినూత్నంగా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధానాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శ‌నివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్, పార్క్ హయత్ హోటల్ లో జరిగిన వి-వైశ్య తెలంగాణ ఆధ్వర్యంలో వి -వైశ్య కౌండిన్య హైదరాబాద్ గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతుంద‌న్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ ప్రారంభమయ్యాక ఇప్పటివరకు మొత్తం 9395 పరిశ్రమలు అనుమతులు పొందాయన్నారు. వీటిద్వారా రాష్ట్రానికి రూ.1.58 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పరిశ్రమలన్నీ ప్రారంభమయ్యాక 15.28 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.

టీఎస్‌ఐఐసీ ద్వారా భూమి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా, 15 రోజుల్లో అనుమతులు, మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీటి సరఫరా లభిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కిందన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు న‌లుగురుకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి, ఒకరికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా అవకాశం దక్కిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగిందన్నారు. త్వరలో టూరిజం కొత్త పాలసీలు రాబోతున్నవని, అందుకు ఎన్ఆర్ఐ లు కూడా సపోర్ట్ చేయాలని తెలంగాణ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎన్ఆర్ఐ వింగ్ చైర్మన్ జయసింహ, ప్రెసిడెంట్ హరి రెయిని, కోశాధికారి దినకరన్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఎండీ సీహెచ్ సంగమేశ్వ‌ర్ గుప్తా, వి-వైశ్య తెలంగాణ ఫౌండర్ పడకంటి అనిల్ గుప్తా, బొగ్గారపు వరుణ్, అనిల్ గుప్తా, మొగుడం పల్లి శంకర్, ముచ్చర్ల రమేష్ గుప్త, బద్రీనాద్, భావన, దివ్య, సంతోష్, ప్రవీణ్ ఆర్యవైశ్య వ్యాపార వేత్తలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement