Thursday, November 28, 2024

Indigo | హైదరాబాద్ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు..

హైదరాబాద్ నుంచి కొత్త‌గా మరో 7 విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రెండు నగరాల నుంచి మొత్తం 11 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఏడు సర్వీసుల్లో అయోధ్యతో పాటు రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ నగరాలకు ఈ నెల (సెప్టెంబర్) కొత్త విమానాలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌కు దేశీయ విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

కాగా, విశాఖపట్నం నుంచి సెప్టెంబర్‌లో ఒక సర్వీసు, అక్టోబర్‌లో మరో 3 సర్వీసులను ప్రారంభించనున్నారు. సెప్టెంబరు 21న విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ నుంచి విజయవాడకు, విశాఖ నుంచి అహ్మదాబాద్‌కు కొత్త సర్వీసు కూడా అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement