Monday, January 30, 2023

Hyderabad : భారీగా గంజాయి ధ్వంసం..

న‌గ‌రంలో గంజాయి స్మ‌గ్లింగ్ ను క‌ట్ట‌డి చేసేందుకు పోలీసులు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. పోలీసులు స్మ‌గ్ల‌ర్ల‌ను ప‌ట్టుకుని భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. వివిధ కేసుల్లో వారి నుంచి ప‌ట్టుబ‌డిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించి ప‌ట్టుబ‌డిన గంజాయిని డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీసీఎస్‌, డీడీ జాయింట్‌ కమిషనర్‌ గజరావు భూపాల్‌ నేతృత్వంలో 1,500 కిలోల గంజాయి, 1,100 మిల్లీ లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌, 500 గ్రాముల ఎండీఎంఏ ధ్వంసం చేశారు. ఈ మొత్తం ప‌ది పోలీస్ స్టేష‌న్ల‌లో న‌మోదైన 40 ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలని జాయింట్‌ సీపీ తెలిపారు. దుండిగల్‌లోని హైదరాబాద్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్విరో ఇంజనీర్‌ లిమిటెడ్‌లో ధ్వంసం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement