Tuesday, April 16, 2024

HYD: సాహితి ఇన్‌ఫ్రా సంస్థలో ఈడీ సోదాలు

హైద‌రాబాద్ నగరంలోని సాహితి ఇన్‌ఫ్రా సంస్థలో ఈరోజు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహితి ఇన్‌ఫ్రా సంస్థ డైరెక్టర్ పూర్ణారావు ఇంటితో పాటు ఆ సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహితి ఇన్ ఫ్రా డైరెక్టర్ పూర్ణారావు మరికొన్ని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హైద‌రాబాద్ నగరంలోని పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడ హైద‌రాబాద్ నగరంలోని రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటనలు తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement