Monday, September 25, 2023

మోబిల్ టీఎం కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్‌

మోబిల్ టీఎం, లూబ్రికేషన్ సాంకేతిక ఆవిష్కరణలో విశ్వగురువు, వీరు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ను వారి సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టుగా ప్రకటించారు. ఆత్మవిశ్వాసానికి, అసామాన్య శక్తికి ప్రతీక అయిన హృతిక్ మానవ పురోగతికి, విశ్వాస నిర్మాణానికి, కస్టమర్‌లు వారి అసలైన శక్తిని తెలుసుకొనేలా చేయాలనే మోబిల్ బ్రాండ్ విలువలకు సిసలైన ఉదాహరణగా నిలుస్తారు. ఈ సందర్భంగా ఎక్సాన్ మోబిల్ లూబ్రికాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విపిన్ రాణా మాట్లాడుతూ… భారతదేశంలో తమ మోబిల్ లూబ్రికాంట్స్ కోసం హృతిక్ రోషన్‌తో భాగస్వామ్యం చెందటం తమకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు.

- Advertisement -
   

భారతదేశ లూబ్రికాంట్ అవసరాలను పూరిస్తామనే తమ మాటకు వ్యాపార భాగస్వాములు, వినియోగదారుల్లో విశ్వాసం కలిగించేలా ఆయన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని తాము నమ్ముతున్నామన్నారు. నటుడు హృతిక్ రోషన్ మాట్లాడుతూ… లోకవ్యాప్తంగా నమ్మిక గొన్న మోబిల్ ఇంకా వారి విశ్వసనీయ బ్రాండ్ పేరుతో భాగస్వామ్యం చెందటం తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. ప్రజల జీవితాలు, సాంఘీక పరమైన మార్పుల కోసం విజేతలకు కావలసింది విశ్వాసమని తాను గట్టిగా నమ్ముతానన్నారు. మోబిల్ బ్రాండ్ అనేది దానిని చక్కగా ప్రతిబింబిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement