Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో సాయంత్రం భారీ వర్షం..

హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే మూడ్రోజులుగా చిరుజల్లులతో నగరం తడిసిముద్ధ‌వుతున్నది. కాగా, వాతావరణ శాఖ సూచనతో వానాకాల ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-29555500 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కాగా, నగరవాసులు మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.గత రెండ్రోజుల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నగరవ్యాప్తంగా చిరుజల్లులతో రహదారులపై జనం రద్దీ తగ్గిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement