Friday, April 26, 2024

గిరిజ‌నుల అభ్యున్న‌తికి పెద్ద‌పీట

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బంజరహిల్స్ లో గిరిజన భవనాలను రాష్ట్ర మత్స్య,పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మితో కలిసి రాష్ట్ర గిరిజన, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ నెల 16,17,18 వ తేదీలలో జ‌రిగే 75 వసంతాల తెలంగాణ జాతీయ సమైక్యత వక్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన భవనాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిగా నిలిచేలా గిరిజన భవనాలను ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే గిరిజన భవనం గిజన ఆచార వ్యవహారాలు, గిరిజనులు తయారు చేసే వస్తువులను మార్కెటింగ్ వ్యవస్థను పెంపొందించే విధంగా ఈ భవనంలో ఏర్పాటు చేశారని మేయర్ అన్నారు. ముఖ్యమంత్రి అన్ని కులాలకు మతాలకు వారి వారి సామాజిక అభివృద్ధికి ఖర్చుకు వెనుకాడ‌కుండా సామూహిక భవనాల నిర్మాణంతో పాటు అవసరమైన స్థలం కేటాయించి నిధులను కూడా మంజూరు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కులాల సంస్కృతి సంప్రదాయాలను చిర‌స్థాయిగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా గిరిజన భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలో భవనాలకు ప్రభుత్వం ఒకే మాదిరిగా నిర్మాణాలను చేపట్టుతున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement