Saturday, November 27, 2021

ప్యాసెంజర్లకు గుడ్ న్యూస్.. ఆఫర్లు ప్రకటించిన మెట్రో..

ప్ర‌భ‌న్యూస్: హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ఆఫర్లతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా మెట్రోలో ప్రయాణించిన వారికి లక్కీడ్రా ద్వారా అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో బహుమతులను అందించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పు డిప్పుడే మెట్రో కోలుకుంటుంది. క్రమంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోందని అన్నారు.

ప్రస్తుతం రోజుకు 2.30 లక్షల ప్రయా ణికులు మెట్రో సేవలను వినియోగిస్తుండగా.. భవిష్యత్తులో 4లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కోవిడ్‌ తరువాత కాలంలో మిగిలిన నగరాల్లో కంటే హైదరాబాద్‌ మెట్రో లోనే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగు తోందన్నారు. కాగా, మెట్రో సువర్ణ ఆఫర్ల లక్కీడ్రాలో ఎంపికైన ముగ్గురు విజేతలకు ఎల్‌ఈ డీ టీవీ, వాషింగ్‌ మెషిన్‌, మైక్రో ఓవెన్‌లను అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News