Saturday, April 20, 2024

కరోనాతో అనాథలైన బాలలకు ఉచిత విద్య

హైదరాబాద్: కరోనా దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్థికంగా చితికిపోయాయి. అలాంటి కుటుంబాల్లోని వారు తమ వాళ్ళను కోల్పోయి అనాథలుగా మారారు. అలా తన వాళ్ళను కోల్పోయిన వాటికి అండగా ఉండేందుకు ఆపన్న హస్తం సిద్ధమైంది. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలబాలికల కోసం కేశవ స్మారక విద్యా సంస్థ ‘ఆపన్న హస్తం’ అనే ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కోవిడ్ అనాథలకు ఉచిత విద్య అందిస్తామని విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం స్వయంగా ప్రకటించారు. బాధిత కుటుంబాల బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలల్లో ప్రవేశాల కోసం నారాయణగూడలోని కేశవ స్మారక ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95422 50106, 77021 18141, 040-23264222 నంబర్లలో సంప్రదించాలని, లేదంటే పాఠశాల పని వేళల్లో ప్రిన్సిపాల్‌ను కలవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement