Wednesday, April 24, 2024

ఈ సంక్రాంతికి గోల్డ్ డ్రాప్ తో పిండి వంట‌లు చేసుకోండి : మితేష్ లోహియా

ఈ సంక్రాంతికి ప్రపంచ శ్రేణి నాణ్యత తయారీ ప్రమాణాలను అనుసరించే గోల్డ్‌ డ్రాప్‌ నూనెలో వండే పిండివంటలు, విభిన్న రకాల ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ మితేష్ లోహియా అన్నారు.ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ…భారతీయ పల్లె వైభవానికి ప్రతీక అంటే సంక్రాంతి అన్నారు. అలాంటి సంక్రాంతి వేళ తప్పనిసరిగా దర్శనమిచ్చే పిండి వంటకాలలో అరిసెలు అత్యంత ప్రధానమైనవని, తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ.. మూడు ప్రాంతాల్లోనూ అరిసెలు తప్పనిసరిగా సంక్రాంతి వేళ కనిపిస్తాయి. అరిసెల తయారీలో బియ్యం పిండి, బెల్లం అతి ప్రధానమైనవని, నూనె లేదంటే నెయ్యితో వీటిని తయారుచేస్తారన్నారు. అరిసెలకు రుచి, తమకు ఆరోగ్యం కావాలనుకునే వారు మాత్రం వీటిలో నువ్వులు కూడా వేస్తుంటారన్నారు.


సంక్రాంతి పండుగ కాలంలో ప్రతి ఒక్కరూ విభిన్న రకాల స్వీట్లు, రుచులు ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారన్నారు. పండుగ పూర్తయిన తరువాత కూడా ఇది కొనసాగుతుందన్నారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్ధాలతో పాటుగా వాటి తయారీలో వినియోగించే నూనె కూడా అంతే నాణ్యతతో కూడి ఉండాల్సిన ఆవశ్యకతను ఇది వెల్లడిస్తుందన్నారు. త‌మ‌ వరకూ ఇది సంక్రాంతి కా స్వాద్‌ అని అన్నారు. ఔరౌర గారెలల్ల.. అయ్యారే బూరెలిల్ల.. ఓహో హోరే అరిసెలెల్ల.. ఈయెల్ల నాకే చెల్ల.. అని మాయాబజార్‌ సినిమాలో ఘటోత్కచుడు లొట్టలేసుకుని తిని ఉండొచ్చు కానీ… మనం మాత్రం అలా లొట్టలేయకపోయినా సంప్రదాయ రుచుల ఆస్వాదన చేస్తూనే పిండివంటల వెనుక దాగిన స్ఫూర్తిని గ్రహిస్తే, జీవితమంతా సంతోషంగా ఉంటుంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement