మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ ప్లేస్ లో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు ద్విచక్ర వాహనాలు దగ్ధమైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అడుపోలీకి తరలించారు.
అగ్నిప్రమాదం వెనుక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందేమో అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన చాదర్ ఘాట్, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడు జాకీర్ అలియాస్ బంటుగా గుర్తించారు.
అనంతరం పోలీసులు జకీర్ ఇంటిపై ఏకకాలంలో దాడులు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలోనూ పలు వాహనాలను దగ్ధం చేసినట్లుగా పోలీసులు నిందితుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు ఈ ఘటనపై ఇంకా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.