Wednesday, April 24, 2024

దక్షిణాది మార్కెట్‌లో విస్తరించిన ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) పరిష్కారాల ప్రదాత ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ , దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మంబట్టు పారిశ్రామిక ప్రాంతంలో తమ నూతన గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ యూనిట్‌ ద్వారా ఈ విస్తరణ కార్యక్రమాలను ప్రారంభించింది. తమ నూతన సదుపాయం కోసం శంఖుస్థాపన కార్యక్రమాలను బుధవారం నిర్వహించింది. సుళ్లూరుపేట ఎంఎల్‌ఏ, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌ కరికాల్‌ వెలవన్‌, ఐఏఎస్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రూప్‌ ఛైర్మన్‌ బీఎల్‌ బోత్రా, డైరెక్టర్‌ సంజయ్‌ సింఘానియా, డైరెక్టర్‌ నిఖిల్‌ బోత్రా పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ బోత్రా మాట్లాడుతూ… ఇప్పటికే రెండు ప్లాంట్‌లు రాజస్తాన్‌లోని ఘిలోత్‌, గ్రేటర్‌ నోయిడాలలో ఉన్నాయన్నారు. వీటి మొత్తం సామర్ధ్యం ఒక లక్ష మెట్రిక్‌ టన్నులన్నారు. దక్షిణాదిలో కూడా మార్కెట్‌ విస్తరించడంలో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రస్తుతం దక్షిణాదికి రావాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటుగా భవంతి ఖర్చు కూడా పెరుగుతుందన్నారు. పీఈబీలు సంప్రదాయ భవంతి ప్రక్రియలతో పోలిస్తే 40% తక్కువ కార్బన్‌ విడుదల చేయడంతో పాటుగా 50% వేగంగా భవంతి పూర్తి కావడంలో సహాయపడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement