Tuesday, March 26, 2024

ప్ర‌తి ఆదివారం జీ తెలుగులో సింగింగ్ రియాలిటీ షో ‘స రి గ మ ప’

జీ తెలుగు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో ‘స రి గ మ ప’ ఒక కొత్త సీజన్ తో మన ముందుకి వచ్చేస్తుంది. రెండు నెలల ముందు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ షో ఇప్పుడు ప్రతిభావంతులైన సింగర్స్ ని తన వేదిక మీదకు తీసుకొచ్చింది. అందులో ఎవరు ముందుకి వెళ్తారు, ఎవరు వెనుతిరుగుతారో తెలియాలంటే, ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు తప్పక వీక్షించ‌వ‌చ్చ‌ని తెలిపింది. చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – తెలుగు, అనురాధ గూడూరు ఈ షో గురించి మాట్లాడుతూ… “స రి గ మ ప ఒక షో మాత్రమే కాదు, ఎంతో మంది తలరాతల్ని మార్చిన ఒక వేదిక అన్నారు. అలాంటి షో ని తాము మళ్లీ అందరి ముందుకి ఒక కొత్త సీసన్ తో తేవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ జడ్జెస్ లో ఒకరైన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ… తాను స రి గ మ ప తో మొదటి నుంచి ప్రయాణిస్తున్నానన్నారు. ఇప్పుడు 14 వ సీజన్ తో మళ్లీ అందరిముందుకి వస్తున్నామ‌న్నారు. ఇంతలా ఆదరిస్తునందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎస్ పి శైలజ మాట్లాడుతూ… మరోసారి అందరిని స రి గ మ ప ద్వారా కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడూ ఈ వేదిక ప్రతిభావంతులని అక్కున చేర్చుకొని వారికివారే సాటి అనే విధంగా తీర్చిదిద్దుతుందన్నారు. స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ జడ్జి గా వ్యవరిస్తున్న సింగర్ స్మిత మాట్లాడుతూ… తాను కూడా ఇలాంటి ఒక ప్లాట్ ఫామ్ నుంచి వచ్చానన్నారు. చిన్నప్పటి నుంచి సంగీతం త‌నతోనే ఉందన్నారు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ…స రి గ మ ప ఎంతోమంది జీవితాలని మార్చివేసిందన్నారు. మరోసారి అందరి ముందుకి రాబోతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement