Saturday, April 20, 2024

క‌రోనా వేళ వంటింటి ధ‌ర‌ల మంట‌…

హైదరాబాద్‌, : ఇళ్లల్లో నిత్యావసర వస్తువుల ధరలు మంటపుట్టి స్తున్నాయి. ఒకవైపు కొవిడ్‌ మహమ్మారి, మరోవైపు పెరుగుతున్న ధరల భారం వెరసి సామాన్యుడుకి మోయలేని భారంగా మారింది. దీంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని ప్రజలు చర్చించుకుం టున్నారు. గత వారం వరకు రూ.130 వరకు ఉన్న వంటనూనెలు ప్రస్తుతం రూ.180 నుంచి 190 వరకు ధరలు పలుకుతున్నాయి. కందిపప్పు, మినపగుండ్లు, పల్లిలు అమాంతం ధర పెరగ డంతో సామాన్యులు ధరలతో అల్లాడి పోతున్నారు. రాబడి చారణా అయితే.. ఖర్చు బారణా ఉందంటూ సామెత లు వేసుకోవడం గమనార్హం.
ఫిబ్రవరి, మార్చి వరకు సామాన్యుడికి అందుబాటు లోనే ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడానికి కరోనానే కారణ మని తెలుస్తోంది. పలు రాష్ట్రాల నుంచి రావాల్సిన పప్పులు ఆలస్యం కావడంతో పాటు లాక్‌డౌన్‌ ఉంటుందన్న ఆలోచ నతో ప్రజలంతా ఒక్కసారిగా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడంతో డిమాండ్‌ పెరగడంతో అదునుగా భావించి వ్యాపారులు ధరలు పెంచినట్టు తెలుస్తోంది. దీని కారణంగానే ఒక్కసారిగా ధరలు పెరిగాయని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.
మళ్లి పెరిగిన నూనెల ధరలు
నూనెల ముడిసరుకుల దిగుమతులపై విధించే సుంకాన్ని పెంచడంతో ఫిబ్రవరిలోనే నూనెలకు ధరలు పెరగగా, మళ్లిd ఇపుడు కొవిడ్‌ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దిగుమతలు చేసకుంటుండడంతో కూడా ధరలు పెరుగుతన్నట్టు తెలుస్తోంది. ధరల పెరుగుదలతో పల్లి, సన్‌ ప్లవర్‌ నూనెల విక్ర యాలు కాస్త తగ్గినట్టు కూడా వ్యాపారుల ద్వారా తెలుస్తోంది. వీటి స్థానంలో వినియోగదారులు పామాయిల్‌ను అధికంగా వినియోగిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.
కొవిడ్‌తో పాటు దిగుమతుల సుంకాల పెరుగుదలతో నూనెలతో పాటు, ఇతర నిత్యావసర వస్తువులకు ధరలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో సన్‌ప్లవర్‌ రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.190 ధర పలుకుతోంది. పామాయిల్‌ రూ.120 ఉండగా ప్రస్తుతం 150 వరకు పడుతోంది, దీంతో పాటు పల్లి ఆయిల్‌ కూడా ఫిబ్రవరిలో రూ.160 ఉండగా ఇపుడు 190 నుంచి 200 వరకు ధర పడుతోంది. దీంతో నూనెలు కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
అధిక ధరలతో కల్తీకి ఆస్కారం
నూనెలకు ధరలు పెరగడంతో కల్తీకి ఆస్కారం ఉంది. ఇప్పటికే పెద్ద కంపెనీల నూనెల ప్యాకెట్ల తరహాలో ప్యాకెట్లు తయారుచేసి వాటిలో పత్తి గింజల నూనెతో పాటు శుద్ధి చేసిన నూనె నింపి విక్రయిస్తున్నట్టు సమాచారం. దీంతో వినియోగదారులు ఆరోగ్యానికి హాని జరగడంతో పలు సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో కల్తీకి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అధికారులు కల్తీరాయుళ్లపై దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.
కందిపప్పు.. రూ.110
ప్రస్తుతం పప్పుల ధరలు ప్రజలు మోయలేని భారంగా మారాయి. ఇదే తరుణంలో కేజీ కందిపప్పు రూ.110 ఉండగా, మినపగుండ్లు కేజీ రూ.120, పెసరపప్పు కేజీ రూ.106 పల్లిdలు రూ.120 పలకుతున్నాయి. ఏ పప్పు చూసినా రూ.100కు పైగా పలుకుతోంది. ఒకవైపు నూనెలకు మరోవైపు పప్పులకు ధరలు అమాంతం పెరగడంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు మోయలేని భారంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement